కోలీవుడ్ ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ (48) హఠత్తుగా మృతి చెందారు. కాగా, ఈయన శుక్రవారం అర్థరాత్రి ఛాతినొప్పితో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో.. వెంటనే కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రవైటు ఆసుపత్రికి తరలించారు.
పార్లమెంటు ఎన్నికలకు బిఆర్ఎస్ (BRS) అభ్యర్థులుగా ప్రకటించిన మరో ఇద్దరు నేతలు కాంగ్రెస్‌లోకి (Congress) వెళ్లనున్నారా? హస్తం పార్టీలోకి వెళ్లి అక్కడి నుంచి ఎన్నికల బరిలో నిలవనున్నారా? అంటే.. అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇప్పటికే చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన రంజిత్‌రెడ్డి కాంగ్రె్‌సలో చేరగా, తాజాగా వరంగల్ అభ్యర్థి కడియం కావ్య కూడా గులాబీ పార్టీకి రాజీనామా చేసి.. హస్తం గూటికి చేరేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే.తాజాగా కె.కేశవరావు, కడియం శ్రీహరి కూడా పార్టీ మారడం ఖాయమైంది.
దివంగత నేత నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని శనివారం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ నివాసానికి చేరుకున్న సుహాసిని ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డికి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం 25వ వార్షికోత్సవ ద్వితీయ పుష్కర మహా కుంభాభిషేక మహోత్సవం భాగంగా మొదటి రోజు గణపతి పూజ.
ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL), సిబ్బందికి సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు ఏవియేషన్ వాచ్డాగ్ 'ఎయిర్ ఇండియా' (Air India)కు రూ. 80 లక్షల జరిమానా విధించింది. డీజీసీఏ ఈ ఏడాది జనవరిలో ఎయిర్ ఇండియా లిమిటెడ్‌పై స్పాట్ ఆడిట్ నిర్వహించిన తర్వాత ఈ ప్రకటన వెలువడిందని ఏవియేషన్ రెగ్యులేటర్ మార్చి 22న ఒక ప్రకటనలో వెల్లడించింది...
బ్రహ్మోత్సవాల ముగింపుకు హాజరైన ఎమ్మెల్యే డోర్నకల్ వెంకటేశ్వర ఆలయంలో ఆరు రోజులుగా జరిగిన పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి 17వ బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు గురువారం ముగిశాయి ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ రామచంద్రు నాయక్ హాజరయ్యారు...
కాకతీయ విశ్వవిద్యాలయంలో కె-హబ్, భారత రత్న పి. వి. నరసింహారావు నాలెడ్జ్ సెంటర్, మెన్స్ హాస్టల్, సమ్మక్క, సారలమ్మ ఉమెన్స్ హాస్టల్స్, అకాడమిక్, అకాడమిక్ బ్లాక్ 3, ఎంబిఏ బిల్డింగ్, మెన్ డైనింగ్ హాల్, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ రెండో ఫ్లోర్, కాంపౌండ్ హాల్, తదితర అభివృద్ధి పనులను మంత్రి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శిలాఫలకాలను ఆవిష్కరించి ప్రారంభించారు..
రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా తరలిస్తున్న హవాలా డబ్బును పోలీసులు పట్టుకున్నారు. 2024, మార్చి 6వ తేదీ బుధవారం రాత్రి 12.30 గంటల సమయంలో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు చేపట్టి హవాలా డబ్బును స్వాధీనం చేసుకున్నారు...
హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్ లో పోలీసులు ఆంక్షలు విధించారు. మార్చి 25న ఉదయం 6 గంటల నుంచి 26 ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి ఆదేశాలు జారీ చేశారు...
అతి త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో డోర్నకల్ లో పారా మిలటరీ సిబ్బంది సి సెల్ పార్టీ పోలీసులు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు డోర్నకల్ లో కవాతును నిర్వహించారు ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ చెన్నయ్య మాట్లాడారు..
డిల్లీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేయటం.. ఆమెకు కోర్టు 7 రోజుల రిమాండ్ విధించటం తెలిసిందే. అయితే.. కస్టడీలో భాగంగా తొలి రోజు కవితను ఈడీ అధికారులు విచారించారు. కోర్టు ఆదేశాల మేరకు.. ఉదయం 10 నుంచి 5 గంటల వరకు విచారణ చేసిన అధికారులు.. ఆ విచారణ మొత్తాన్ని కూడా వీడియో తీశారు...
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛయుత వాతావరణంలో వినియోగించుకునే విధంగా భరోసా కల్పించడం కోసమే ఫ్లాగ్ మార్చ్ పోలీసు కవాతు నిర్వహిస్తున్నామని పోలీస్ కమీషనర్ సునీల్ దత్ తెలిపారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెంట్రల్ పోలీస్ ఫోర్స్, పారమిలటరీ బలగాలు,స్థానిక పోలీసు సిబ్బంది కలిసి ఫ్లాగ్ మార్చ్ పోలీసు కవాతును నిర్వహిస్తున్నారు..
లోక్ సభ ఎన్నికల నేపధ్యంలో కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన వరంగల్ నగర పోలీసు కమీషనర్ అంబర్ కిషోర్ ఝా, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు రాధిక గుప్తా, వెంకటరెడ్డి, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధశుక్లా, డిఆర్ఓ వైవి గణేష్, ఇతర అధికారులు పాల్గోన్నారు..
డోర్నకల్ మండలం అమ్మపాలెం గ్రామంలోని శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు..
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ)లో ఆధారాలను ధ్వంసం చేయాల్సిన అవసరమేంటని ఆ విభాగంలో డీఎస్పీగా పనిచేసిన దుగ్యాల ప్రణీత్‌రావును హైదరాబాద్ పోలీసులు ప్రశ్నించారుఅందుకు ఎవరైనా ఆదేశించారా అని ఆరా తీశారు. ఇదే వ్యవహారంలో అరెస్టయిన ప్రణీత్‌రావును పోలీసులు ఆదివారం కస్టడీలోకి తీసుకున్నారు..
ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో అరెస్టై జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ ఇవ్వొద్దు. త్వరలో ఒక హై ప్రొఫైల్ వ్యక్తిని అరెస్టు చేయబోతున్నాం.” ట్రయల్ కోర్టులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) తరపు న్యాయవాది చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి..
వరంగల్ పోలీస్ కమిషనరేట్ అధ్వర్యంలో టీ.ఎం.ఐ ఫౌండేషన్ సహకారం హనుమకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు మెగా జాబ్‌మేళాను వరంగల్ పోలీస్‌కమిషనర్ జ్యోతి ప్రజ్వల చేసి ప్రారంభించారు.ఇరువైకి పైగా వివిధ కంపెనీలకు చెందిన హెచ్.ఆర్లు వచ్చిన యువతకు సంబంధించి విద్యార్హతలను బట్టి ఇంటర్యూలు నిర్వహించి నియామక పత్రాలను అందించారు... ..
ఈమధ్య కాలంలో ఏసీబీ అధికారులు ప్రభుత్వ అధికారులపై ప్రత్యేక ద్రుష్టి సారించింది. అనేక చోట్ల తమ విధులను నిర్వహించేందుకు సామాన్యుల దగ్గర లంచం తీసుకుంటున్నారు అనే సమాచారం అందడం తో ప్రత్యేకమైన నిఘా ని ఏర్పాటు చేసిన ఏసీబీ, ఈమధ్యనే ఒక అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఘటనని అంత తేలికగా మనం మర్చిపోలేం...
తాను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీఎస్పీని వీడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం బీఆర్ఎస్ లో చేరేందుకు మార్గం సుగమమైందని తెలిపారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు...
అన్నమయ్య జిల్లా పీలేరులో ఐటీ మోసగాడి వ్యవహారం వెలుగు చూసింది. ఐటి ఉద్యోగాల పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డ పీలేరు యువకుడు ఢిల్లీ, హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని 300 మందికి పైగా నిరుద్యోగులను కుచ్చుటోపి పెట్టాడు. ఏపీ తెలంగాణకు సంబంధించిన యువతి యువకులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ మోసం బయట పడింది...
లక్ష లంచం తీసుకుంటూ ఇద్దరు జలమండలి ఉద్యోగులు శుక్రవారం ఏసీబీకి పట్టుబడ్డారు. రెవెన్యూ సర్కిల్ సీజీఎం కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ ఫైనాన్స్ ఎల్.రాకేష్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సందీప్‌ను అరెస్టు చేశారు...
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. బంజరాహిల్స్ లోని కవిత నివాసంలో ఆమెను అరెస్ట్ చేసి నేరుగా శంషాబాద్ విమానాశ్రయం ద్వారా విమానంలో దిల్లీకి తరలించారు. మద్యం కుంభకోణంలో కవిత పాత్ర ఉన్నట్లు తగిన ఆధారాలున్నాయని అరెస్ట్ నోటీసుల్లో ఈడీ పేర్కొంది. ఇవాళ దిల్లీలో కవితను కోర్టు ముందు హాజరపర్చనున్నారు...
హ్యాపీ హోమ్(శామీర్‌పేట్) తదితర ప్రాజెక్టుల్లో 'ప్రీ-లాంచ్' పేరుతో సుమారు 300 మంది నుంచి డిపాజిట్ల రూపంలో సుమారు రూ.80కోట్ల వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్న భువంతేజ్ ఇన్ఫ్రా ప్రాజెక్టు లిమిటెడ్‌కు చెందిన ఇద్దరిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు...
మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్‌కు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఆయన బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. బీఆర్ఎస్ తనను అవమాన పరిచిందని ఆరూరి రమేశ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాగా ఆరూరి రమేశ్ పస్తుతం వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు...
పార్లమెంట్ ఎన్నికల నేపధ్యంలో బీఆర్ఎస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గురువారం మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, అతని తనయుడు భద్రా రెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బెంగళూరులో డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు...
ఉమ్మడి మహబూబ్‌నగర్ బ్యూరో, ప్రభ న్యూస్ : మహబూబ్ నగర్ మాజీ ఎంపీ, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి కలిశారు. జితేందర్ రెడ్డి బిజేపి పార్లమెంటు సీటు ఆశించి భంగపడ్డారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనను స్వయంగా ఇంటికి వెళ్లి కలిశారు..
డబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో నగర అభివృద్ధి లో భాగంగా ఆదివారం రూ.280.85 కోట్ల వ్యయంతో పలుఅభివృద్ధి పనులకు ఎమ్మెల్యేలతో కలసి ప్రారంభత్సవాలు, శంకుస్థాపనలు చేశారు...
ఎస్ ఎన్ ఎం క్లబ్ వద్ద అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన పలు మంత్రుల కార్యక్రమంలో తూర్పు జర్నలిస్టులపై పరుష పదజాలంతో దూషించిన వరంగల్ సెంట్రల్ జోన్ డిసిపి భారీ పై చర్యలు తీసుకోవాలంటూ.జర్నలిస్టులు సంఘాల నాయకులు సీపీకి ఫిర్యాదు చేశారు.
డోర్నకల్ జైన్ భవన్లో టిఆర్ఎస్ పార్టీ మండల ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ మండల పార్టీ అధ్యక్షులు నున్న రమణ మానుకోట ఎంపీగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కవితకు ఎంపీ సీటును ఇచ్చారని ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు...
మీ వద్ద రూ 50 వేల కన్నా ఎక్కువ నగదు ఉంటే ఎన్నికల అధికారులు లేదా పోలీసులు సీజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే లోక్‌సభ ఎన్నికలనేపథ్యంలో శనివారం నుంచి రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి(కోడ్) అమల్లోకి వచ్చింది. అత్యవసరాలకు ఎవరైనా నగదు తరలిస్తుంటే దానికి సంబంధించిన రసీదులు (బ్యాంకు నుంచి తీసుకున్నవి, చెల్లింపులకు సంబంధించిన పత్రాలు) వెంట పెట్టుకోవాలి. ..
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల వేడి మొదలైందిభువనగిరి పార్లమెంట్ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ బిజెపి నుంచి బలమైన అభ్యర్థిని బూర నర్సయ్య గౌడ్ ని బిజెపి పార్టీ ఖరారు చేసింది, ఇటు బి ఆర్ ఎస్ పార్టీ కూడా మరో బలమైన కీలక నేతకు ఎంపీ స్థానాన్ని ఖరారు చేసినట్లు సమాచారం...
హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాయంత్రం 6 గంటలకు ఆఫీసునుంచి వచ్చే ఎవరిని కదిపినా,ఉదయం 9 గంటల సమయంలో ఆఫీసుకు బయలుదేరే వారిని అడిగినా.. కథలు కథలుగా ట్రాఫిక్ కష్టాలు చెబుతారు. ఇక వర్షాకాలం వచ్చిందంటే...
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో మహిళా అధికారులు, ఉద్యోగుల ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ ను బుధవారం నిర్వహించారు, ప్రపంచ మహిళా దినోత్సవం నేపథ్యంలో కలెక్టరేట్ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోనిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు...
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పారెట్ ఫీవర్ గురించి ఎక్కువగా వినిపిస్తోంది. ఇన్నాళ్లు మంకీ ఫీవర్ గురించి భయపడ్డారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి పారెట్ ఫీవర్ కూడా చేరింది. ప్రస్తుతం యూరప్ దేశాలను ఈ పారెట్ ఫీవర్ వణికిస్తోంది. ఈ పారెట్ ఫీవర్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ప్రపంచ వైద్య ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేసింది...
70వేల మంది విద్యార్థుల భవిష్యత్తును మల్లారెడ్డి యూనివర్సిటీలో తీర్చి దిద్దుతున్నామని మల్లారెడ్డి యునివర్సిటీ డెరైక్టర్ భద్ర రెడ్డి అన్నారు. కళాశాల లోపలికి వచ్చి, రౌడీయిజం చేసి విద్యార్థుల జీవితాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. అగ్రికల్చర్ కోర్సులు చేసే విద్యార్థుల తరుపున ఉదయం మైనంపల్లి హనుమంత్ రావు యునివర్సిటీ లోపలకి రావడంపై మాజీ మంత్రి మల్లారెడ్డి యునివర్సిటీ డైరెక్టర్స్ మల్లారెడ్డి కొడుకు భద్రా రెడ్డి, మరియు కోడలు ప్రీతి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు...
వరంగల్ నగరంలో మంత్రులు పొంగులేటి, సీతక్క, కొండాసురేఖల కార్యక్రమంలో జర్నలిస్టులకు తీవ్ర అవమానం జరిగింది. కార్యక్రమ కవరేజికి వెళ్లిన జర్నలిస్టులను వరంగల్ ఈస్ట్ జోన్ డిసిపి బారీ బూతులు తిడుతూ నెట్టేశారు. తాము కవరేజికి వచ్చామని చెప్పినా వినకుండా బారీ స్వయంగా జర్నలిస్టులపై దాడికి దిగడాన్ని జర్నలిస్టులు ముక్తకంఠంతో ఖండించారు...
డోర్నకల్ లో టిఆర్ఎస్ పార్టీ నుండి వచ్చే వారిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవద్దని కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది తీర్మానం కాపీని డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ పంపనున్నట్లు పార్టీ అధ్యక్షులు కాలా సుమిర్చంద్ జైన్ తెలిపారు..
ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా అపర కుబేరుడిగా పిలుచుకునే ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఫ్రీ వెడ్డింగ్ వేడుకల గురించే చర్చించుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే...
మరో రెండు గ్యారెంటీలను అమలు చేసేందుకు రంగం సిద్దం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ‘మహాలక్ష్మీ’ పథకంలో భాగంగా ఈ నెల 27వ తేదీన రూ. 500కే గ్యాస్ సిలిండర్‌ను ప్రారంభించనుంది...
జీవో 46 రద్దుచేసి గ్రూప్ 1, 2, 3 పోస్టులను పెంచాలి అంటూ నిరుద్యోగులు చలో నిరుద్యోగ మార్చ్ పేరిట ఇందిరా పార్క్ దగ్గర లక్ష మందితో మహా నిరాహార దీక్ష చేయాలనుకున్నారు. కానీ అనుమతి లభించకపోవడంతో దీక్షాస్థలిని మార్చి చైతన్యపురిలోని అశోక ఆన్లైన్ అకాడమీ అశోక్ ఇంటి వద్ద దీక్షను నిర్వహించారు...
బతికున్న వ్యక్తిని రికార్డుల ప్రకారం చంపేశారు. దొంగ పత్రాలు సృష్టించి రూ.60 కోట్ల భూమిని కాజేశారు. నార్సింగి ఏసీపీ రమణగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన ముళ్లపూడి వీర వెంకట సత్యనారాయణరావు తన స్నేహితులతో కలిసి 2005లో శంకర్పల్లి పరిధిలో సర్వే నంబర్లు 334, 335లలో 5-12 ఎకరాలు కొన్నాడు. కాకినాడ, విజయవాడ, మచిలీపట్నానికి చెందిన కొందరు వ్యక్తులు ఈ భూమిని కాజేయాలని కుట్ర పన్నారు....
చుక్కల మందుకు చక్కని స్పందన డోర్నకల్ మండలంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమానికి విశేష స్పందన లభించింది ఉదయం నుండే పిల్లల తల్లిదండ్రులు చుక్కల మందు వేయించుకునేందుకు ఆయా సబ్ సెంటర్లలో బారులు తీరారు డోర్నకల్ లో సబ్ సెంటర్లతోపాటు రైల్వేస్టేషన్లో మున్సిపాలిటీ కార్యాలయము ప్రభుత్వ పాఠశాలలో సెంటర్లను ఏర్పాటు చేసి చిన్నారి పిల్లలకు పల్స్ పోలియో చుక్కలను వేశారు ...
మహాలక్ష్మి పథకం కింద టిఎస్‌ఆర్‌టిసిలో మహిళా ప్రయాణికులకు ఉచిత బస్సు సర్వీసును అమలు చేయడంతో రోజుకు ప్రయాణికుల సంఖ్య 11 లక్షల నుంచి 20 లక్షలకు పెరిగింది. ఎక్కువ మంది ప్రయాణీకులకు సీటింగ్ కల్పించడానికి ,మరియు కండక్టర్ బస్సులో తిరుగుతూ టికెట్లు జారీ చేయడానికి, సిటీ బస్సులలో మెట్రో మోడల్ సీటింగ్‌ను ప్రయత్నించాలనినిర్ణయించుకుంది...
Entertainmentand News ChannelThe public doesn't know what to believe anymore. We don't know what stories are supposedly true, this idea of 'fake news.' We watch it on what I guess you would call a split-focus. It's half entertainment and half mystery.
mistudionews@gmail.com
MI STUDIO plot No:95, 1st Floor,Road No.4 phase-1 Uppal Bhagayath, Hyderabad 500039